![]() |
![]() |
by Suryaa Desk | Wed, Mar 19, 2025, 04:10 PM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసును హైకోర్టు కొట్టివేసింది. జన్వాడలో డ్రోన్ ఎగురవేసిన ఘటనకు సంబంధించి 2020 మార్చిలో నార్సింగి పోలీస్ స్టేషన్‌లో రేవంత్ రెడ్డిపై కేసు నమోదయింది. నార్సింగి పోలీసులు అప్పుడు ఆయనను రిమాండుకు తరలించారు. ఈ క్రమంలో ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయాలని ఆయన తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వాదనల సందర్భంగా జన్వాడ నిషిద్ధ ప్రాంతమేమీ కాదని రేవంత్ రెడ్డి తరఫు న్యాయవాది పేర్కొన్నారు. తప్పుడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారని కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న హైకోర్టు రేవంత్ రెడ్డిపై నమోదైన కేసును కొట్టివేసింది.