|
|
by Suryaa Desk | Sat, Mar 22, 2025, 08:08 PM
నోటికి వచ్చిన హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని BRS అధినేత కేసీఆర్ మండిపడ్డారు. అధికారంలోకి వచ్చాకా ఒక్క హామీ కూడా నెరవేర్చడం లేదని విమర్శించారు. మేనిఫెస్టోలో పెట్టకున్నా రైతు బంధు, కల్యాణలక్ష్మీ ఇచ్చిన ఘనత బీఆర్ఎస్‌దేనని అన్నారు. బెల్లం ఉన్న దగ్గరకే ఈగలు వచ్చినట్టుగా.. తెలంగాణను దోచుకోవడానికి కొందరు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. పదేళ్ల పాలనలో ఎలాంటి ఇబ్బందులు లేవని.. ఇప్పుడు రాష్ట్రం సమస్యల వలయంలో చిక్కుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం ఎప్పటికైనా పోరాడేది బీఆర్‌ఎస్ మాత్రమేనని పేర్కొన్నారు. అందరూ ఒక్కో కేసీఆర్‌ల తయారు కావాలన్నారు. కాంగ్రెస్ నోటికొచ్చిన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.