|
|
by Suryaa Desk | Sun, Mar 23, 2025, 12:49 PM
పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం. నాలుగేళ్ల చిన్నారిని బీరు సీసాతో కొట్టి చంపిన సైకో.ఇన్ఫోసిస్ సమీపంలో కల్పదరు ప్రాజెక్టులో లేబర్ యోగేశ్వర్ దంపతులు పనిచేస్తున్న సమయంలో పక్కనే ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారి రియాకుమారిని వెస్ట్ బెంగాల్ కు చెందిన సైకో హేమ్ బ్రోమ్ అతి దారుణంగా బీరు సీసాతో దాడి చేశాడు. దాడి అనంతరం పారిపోతున్న క్రమంలో చూసిన ప్రత్యక్ష సాక్షులు స్థానికంగా ఉన్నటువంటి జనాలు పట్టుకొని సైకోను చితిక చితకబాదారు, తాళ్లతో కట్టేసి పోలీసులకు అప్పగించారు. హుటాహుటిన తీవ్ర గాయాలైన చిన్నారి రియాకుమారిని గాంధీ ఆసుపత్రికి తరలించిన తల్లిదండ్రులు . చిన్నారి చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సైకో వెస్ట్ బెంగాల్ కు చెందిన హెమ్ బ్రోమ్ ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు