![]() |
![]() |
by Suryaa Desk | Wed, Mar 26, 2025, 08:36 PM
కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన బుధవారం సైదాబాద్ సింగరేణి కాలనీ వాంబే క్వార్టర్స్‌లో చోటుచేసుకుంది. బాధితుల, పోలీసుల కథనం ప్రకారం నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండల పరిధిలోని లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన రమావత్ శివ (28) సింగరేణి కాలనీ బాంబే కాలనీలో నివాసముంటున్నాడు. అతనికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. బుధవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లి కల్లు తాగి వచ్చాడు.అనంతరం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కల్లుకు బానిస కావడంతో గత కొంతకాలంగా కుటుంబ కలహాలు చోటు చేసుకుంటున్నాయి. కుటుంబ కలహాలతోనే ఆత్మహత్యకు పాల్పడ్డట్లు స్థానికులు పోలీసులు తెలియజేశారు. మృతదేహాన్ని పోలీసులు స్వాధీన పరుచుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని సెక్టార్ ఎస్ఐ సాయికృష్ణ దర్యాప్తు జరుపుతున్నారు.