![]() |
![]() |
by Suryaa Desk | Thu, Mar 27, 2025, 10:41 AM
ఈ నెల ఆఖరులోగా ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించి రాయితీ పొందాలని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి గురువారం ఒక ప్రకటనలో అన్నారు. మార్చి 31వ తేదీ తర్వాత ఎటువంటి గడువు పొడిగింపు ఉండదని స్పష్టం చేశారు. ఎల్ఆర్ఎస్ పై లేఅవుట్ డెవలపర్లు, డాక్యుమెంట్ రైటర్లు, సర్వేయర్లుగా ప్లాట్ల యజమానులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించామన్నారు. ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు అనుమతులు ఇవ్వడం జరుగుతుందన్నారు.