![]() |
![]() |
by Suryaa Desk | Fri, Mar 28, 2025, 05:37 AM
మజ్లిస్ పార్టీ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీకి తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి 'ఎక్స్' వేదికగా కౌంటర్ ఇచ్చారు. మంత్రి సీతక్కకు ఇంగ్లీష్, హిందీ రాదని, తనకు తెలుగు రాదని వ్యాఖ్యానించిన వ్యాఖ్యలకి బదిలిస్తూ మంత్రికి హిందీ రాదు సరే, హైదరాబాద్‌లోనే పుట్టిన మీకు తెలుగు ఎందుకు రాదని ప్రశ్నించారు."మంత్రిగారికి హిందీ రాదు సరే, మరి నీకు తెలుగు ఎందుకు రాదు బాబు? హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగినవు కదా! రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు మాట్లాడే మొదటి అధికార భాషా తెలుగు నేర్చుకోవాలనే సామాజిక బాధ్యత నీకు ఉండాలి కదా" అంటూ చురక అంటించారు.అసెంబ్లీలో అందరు సభ్యులు, మంత్రులు తెలుగులోనే మాట్లాడుతున్నప్పుడు మీకు ఏం అర్థమవుతుందని ప్రశ్నించారు. ఏదో ఒకటి అసెంబ్లీలో ప్రసంగం చేసి వెళ్లిపోతే సరిపోతుందా అని విమర్శించారు. తెలుగు రాకపోతే రాష్ట్రంలోని సమస్యలు మీకెలా అర్థమవుతాయని ప్రశ్నించారు. హిందీ, ఇంగ్లీష్ రాకపోతే నీకు అంత చిన్నచూపా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.