![]() |
![]() |
by Suryaa Desk | Fri, Mar 28, 2025, 05:46 AM
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఎప్పుడూ ఎదో విధంగా వైరల్ అవుతూ ఉంటారు. తాజాగా నిన్న శాసనసభలో ఆయన మాట్లాడుతూ... "అధ్యక్షా, ప్రభుత్వానికి నేను రెండు విషయాలను చెప్పాలనుకుంటున్నా. ఒకటి ప్రభుత్వానికి రూ. 11 వందల కోట్లు వచ్చే విషయం. మరొకటి మా మేడ్చల్ నియోజకవర్గంలో సర్పంచ్ లు, కౌన్సిలర్ల బాధలు" అని చెప్పారు. దీంతో స్పీకర్ కలగజేసుకుని రెండు వద్దు ఒకటే చెప్పాలని సూచించారు. దీనితో మల్లారెడ్డి మాట్లాడుతూ.... మా మేడ్చల్ నియోజకవర్గానికి దిష్టి తగిలింది అధ్యక్షా అని అన్నారు. దీంతో, సభలో నవ్వులు విరబూశాయి. ఏం దిష్టి తగిలిందో కానీ... జిల్లాలోని గ్రామాలన్నీ పోయి మున్సిపాలిటీలు అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి తమను జీహెచ్ఎంసీలో కలపొద్దని కోరారు. అనంతరం ప్రభుత్వానికి లాభం చేకూరే విషయం చెబుతానంటూ మాట్లాడే ప్రయత్నం చేసినా ఆయనకు స్పీకర్ అనుమతిని ఇవ్వలేదు.