![]() |
![]() |
by Suryaa Desk | Sat, Mar 29, 2025, 08:50 AM
ఫోన్ టాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మీడియా సంస్థల ఎండి శ్రవణ్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసింది.శనివారం విచారణకు తమ ముందు హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 26వ తేదీన నోటీసులను శ్రవణ్ రావు కుటుంబ సభ్యులకు సిట్ అందజేసింది. గత ఏడాది మార్చిలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫోన్ ట్యాపింగ్‌పై కేసు నమోదు అయింది. కేసు నమోదు అయిన విషయం తెలుసుకున్న శ్రవణ్ రావు వెంటనే తొలుత లండన్ అటు నుండి అమెరికా వెళ్లిపోయారు. అమెరికాలో తల దాచుకున్న ఆయన కోసం రెడ్ కార్నర్ నోటీసు జారి చేశారు. దీంతో శ్రవణ్ రావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ.. పోలీస్ విచారణకు సహకరించాలని న్యాయస్థానం ఆదేశించింది. అయితే ఈరోజు శ్రవణ్ రావు సిట్ విచారణకు హాజరవుతారా లేదా అన్న అంశంపై సందిగ్ధం నెలకొంది.