![]() |
![]() |
by Suryaa Desk | Mon, Mar 31, 2025, 06:24 PM
బీఆర్ఎస్ పార్టీ కీలక నేత, తెలంగాణ మాజీ హోంశాఖ మంత్రి మహమూద్ అలీ ఇంటికి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ వెళ్లారు.రంజాన్ పర్వదినాన స్వయంగా కలిసి శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం వారి ఇంట్లోనే లంచ్ చేశారు. మహమూద్ అలీ కుటుంబ సభ్యులు, బంధువులను ఆప్యాయంగా పలకరిస్తూ విషెస్ చెప్పారు. మరోవైపు.. అంతకుముందు సోషల్ మీడియా వేదికగా రంజాన్ వేళ కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ పెట్టారు. రాష్ట్రంలోని ముస్లింలందరికీ శుభాకాంక్షలు చెబుతూ పోస్టు పెట్టారు. గంగాజమున తెహజీబ్‌కు తెలంగాణ నిలయమన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో మైనారిటీల అభివృద్ధికి విశేష కృషి చేశామని తెలిపారు. మత సామరస్యం, లౌకికవాద పాలనతోనే శాంతిభద్రతలు నెలకొంటాయని చెప్పారు. అభివృద్ధికి సామాజిక ప్రశాంతత కీలకమని వెల్లడించారు. బీఆర్‌ఎస్ విధానాలను కొనసాగిస్తే మరింత ప్రగతి సాధ్యమని తెలిపారు.