![]() |
![]() |
by Suryaa Desk | Tue, Apr 01, 2025, 10:45 AM
మంత్రి వర్గ విస్తరణపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేబినెట్ విస్తరణ గురించి మీడియా ఆయనను ప్రశ్నించగా, మంత్రి వర్గ విస్తరణపై తనకు ఎలాంటి సమాచారం లేదని ఆయన తెలిపారు. ఈ అంశంపై తాను ఇప్పుడే ఏమీ మాట్లాడబోనని పేర్కొన్నారు. మరోవైపు, వచ్చే నెల మూడో తేదీన కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారని వార్తలు వస్తున్నాయి. మంత్రివర్గ విస్తరణలో నలుగురికి అవకాశం ఉంటుందని సమాచారం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి, నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మహబూబ్ నగర్ జిల్లా నుంచి వాకిటి శ్రీహరి, ఆదిలాబాద్ జిల్లా నుంచి గడ్డం వివేక్‌కు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తున్నట్లుగా సమాచారం.