![]() |
![]() |
by Suryaa Desk | Tue, Apr 01, 2025, 10:41 AM
హైదరాబాద్‌లోని కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై తెలంగాణ ప్రభుత్వం ఇరవై ఏళ్ల క్రితం నాటి రెండు కీలక డాక్యుమెంట్లను విడుదల చేసింది. 400 ఎకరాల భూమి విషయంలో టీజీఐఐసీ, హెచ్‌సీయూ మధ్య వివాదం నెలకొంది. ఈ భూమి ప్రభుత్వానిదేనని టీజీఐఐసీ ప్రకటించగా, దీనిని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) ఖండించింది. హెచ్‌సీయూకు చెందిన కొందరు ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపింది.ఈ నేపథ్యంలో ప్రభుత్వం రెండు డాక్యుమెంట్లను విడుదల చేసింది. ఈ డాక్యుమెంట్ల ప్రకారం 2004 ఫిబ్రవరి 3వ తేదీన 534.28 ఎకరాల భూమిని హెచ్‌సీయూ ప్రభుత్వానికి అప్పగించింది. అదే రోజు గోపనపల్లిలోని 397.16 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం హెచ్‌సీయూకు కేటాయించింది. సంబంధిత డాక్యుమెంట్లపై హెచ్‌సీయూ నాటి రిజిస్ట్రార్, శేరిలింగంపల్లి నాటి రెవెన్యూ అధికారులు సంతకాలు చేశారు.