![]() |
![]() |
by Suryaa Desk | Tue, Apr 01, 2025, 11:08 AM
హైదరాబాద్‌లోని హయత్ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. లక్ష్మీప్రియ కాలనీలో గల ఒక ప్లాస్టిక్ గోదాంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపు చేస్తున్నారు. ఈ దుర్ఘటనలో దాదాపు రూ. 20 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం.