|
|
by Suryaa Desk | Fri, Nov 21, 2025, 08:23 PM
పటాన్‌చెరు సీనియర్ జర్నలిస్ట్ గిరి ప్రసాద్ గారు ఇటీవల గుండెపోటుతో అకాల మరణం చెందడంతో స్థానిక జర్నలిస్టు వర్గంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ సందర్భంగా పటాన్‌చెరు నియోజకవర్గ జర్నలిస్టులు ఆధ్వర్యంలో రామచంద్రాపురంలోని లక్ష్మీ గార్డెన్స్‌లో నిర్వహించిన సంస్మరణ సభకు DSP ప్రభాకర్ గారు, పటాన్‌చెరు సిఐ వినాయక రెడ్డి గారు, మరియు ప్రిథ్వీరాజ్ గారు హాజరై, గిరి ప్రసాద్ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రిథ్వీరాజ్ గారు మాట్లాడుతూ గిరి ప్రసాద్ గారు నిజాలను వెలుగులోకి తేవడంలో ఆయన చూపిన ధైర్యం, సత్యనిష్ఠ జర్నలిజానికి నిదర్శనం.పటాన్‌చెరులో సామాజిక సమస్యలు, స్థానిక ప్రజల కష్టాలు, ప్రభుత్వ పథకాల అమలు వంటి అనేక అంశాలను నిరంతరం ఆవిష్కరించి, పరిష్కార దిశగా నడిపారు. ఆయన అకాల మరణం పటాన్‌చెరు జర్నలిస్టు వర్గానికి తీరని నష్టం అని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని హృదయపూర్వకంగా నివాళులు అర్పించారు.