|
|
by Suryaa Desk | Sat, Feb 07, 2026, 03:33 PM
సమాచార, పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో 2026–28 సంవత్సరానికి జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల జారీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష శనివారం తెలిపారు. ప్రస్తుత కార్డుల గడువు ఈనెల 28తో ముగియనున్నందున, అర్హత కలిగిన వర్కింగ్ జర్నలిస్టులకు కొత్త కార్డులు జారీ చేయనున్నారు. రాష్ట్రస్థాయి కార్డుల కోసం హైదరాబాద్‌లోని సమాచార, ప్రజాసంబంధాల కమిషనర్‌కు, జిల్లా స్థాయి కార్డుల కోసం జాబితాను జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.http://ipr.telangana.gov.in ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హులైన జర్నలిస్టులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ వివరించారు.