తెలంగాణలోని ఖమ్మం పట్టణానికి చెందిన వరుణ్ రాజ్ పూచ హత్య కేసులో నిందితుడికి అమెరికా కోర్టు 60 ఏళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది. గతేడాది అక్టోబరులో ఇండియానాలోని వాల్పరైసోలోని జిమ్‌లో వరుణ్‌పై దాడిచేయగా.. తొమ్మిది రోజుల పాటు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడి చివరకు ప్రాణాలు కోల్పోయాడు. వరుణ్ వాల్పరైసో యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నాడు. మరో రెండు నెలల్లో ఎంఎస్ పూర్తికానుండగా.. ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. ఈ ఘాతుకానికి పాల్పడిన పోర్టర్ టౌన్‌షిప్‌కి చెందిన నిందితుడు జోర్డాన్ అండ్రేడ్ (25)ను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ కేసులో ఆండ్రేడ్‌ను దోషిగా నిర్దారించిన పోర్టర్ సుపీరియర్ కోర్టు జడ్జ్ జెఫ్రీ క్లైమేర్.. గురువారం అతడికి శిక్షను ఖరారు చేశారు. ఆండ్రేడ్ మానసిక రోగి అని నిర్దారించారు. ఆండ్రేడ్ తన శిక్షను సాంప్రదాయ జైలు లేదా మానసిక ఆరోగ్య సదుపాయంలో అనుభవిస్తారా అనేది ఇండియానా డిపార్ట్‌మెంట్ ఆఫ్ కరెక్షన్ (IDOC) తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
ఫిట్‌నెస్ జిమ్‌లో కూర్చుని ఉణ్న వరుణ్‌పై ఆండ్రేడ్ కత్తితో దాడిచేశాడు. తలకు బలమైన గాయాలు కావడంతో చికిత్స కోసం ఫోర్ట్ వేన్‌లోని ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ఆయన చికిత్స చేసి.. ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేశారు. కానీ, చివరకు 9 రోజుల తర్వాత చనిపోయాడు. వరుణ్ తండ్రి రామ్మూర్తి ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. ఉన్నత చదువుల కోసం అమెరికాకు పంపిన కుమారుడు.. విగతజీవిగా మారడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. గతేడాది ఆగస్టులోనే అతడి భారత్‌కు వచ్చి వెళ్లగా.. అంతలోనే ఘోరం జరిగిపోయింది.
బైపోలార్ డిజార్డర్, స్కిజోఫ్రెనియా అనే మానసిక రుగ్మతతో బాధపడుతోన్న నిందితుడు ఆండ్రేడ్.. వరుణ్‌పై దాడి సమయానికి చికిత్స తీసుకుంటున్నాడు.శిక్ష విధించే సమయంలో ఆండ్రేడ్ తండ్రి జో ఆండ్రేడ్ తీవ్ర పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేశారు. ‘నా కుమారుడు చేసిన పనికి విచారిస్తున్నాం.. బాధిత కుటుంబం ఈ బాధ నుంచి కోలుకోవాలని నేను కోరుకుంటున్నాను’ అన్నారు. ఇక, తీర్పు సమయంలో వరుణ్ కుటుంబసభ్యులు ఎవరైనా ఉన్నారా? అని న్యాయమూర్తి అడిగారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa