ధర్మపురి మండలం రాజారం గ్రామంలోని ప్రాథమిక పాఠశాల రాజారం పాఠశాల విద్యార్థుల విద్యావసరాల కోసం పాఠశాల పూర్వ విద్యార్థులు, 2001-02 SSC మిత్రబృందం సుమారు 30వేల రూపాయల విలువ గల స్మార్ట్ టీ.వి బహుకరణ చేసినారు.
ఇట్టి కార్యక్రమాన్ని ఉద్దేశించి పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాధు శ్రీకాంత్ మాట్లాడుతూ నేటికాలంలో సాంకేతిక సాధనాల వాడకం అనివార్యమని, వాటి వినియోగం వల్ల విద్యార్థుల అభ్యసన మెరుగవుతుందని తెలిపారు.
ఇట్టి కార్యక్రమంలో వీరితో పాటు ధర్మపురి పాఠశాల సముదాయ ప్రధానోపాధ్యాయులు కొలిచాల శ్రీనివాస్, రాజారం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రావులపెల్లి వెంకటరమణ, అమ్మ ఆదర్శ పాఠశాల ఛైర్మన్ లక్ష్మి, ప్రజాప్రతినిధులు సౌల్ల నరేష్, ఎ.మహేందర్,రంగు అశోక్, బండారి మురళి,పాఠశాల పూర్వ విద్యార్థులు,2001-02 SSC బ్యాచ్ మిత్రబృందం, పాఠశాల ఉపాధ్యాయ బృందం బండారి సతీష్,చుంచుకాల శ్వేతారాణి, చల్ల కృష్ణ మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు..