క్యాబేజీని జ్యూస్ లా చేసుకొని ప్రతిరోజు తాగడం వల్ల శరీరానికి చాలా రకాల పోషకాలు లభిస్తాయట. అంతేకాకుండా ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండడం వల్ల కొలెస్ట్రాల్ని కూడా నియంత్రిస్తాయి. ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ శరీర బరువును తగ్గించడమే కాకుండా అనారోగ్య సమస్యల బారిన పడకుండా రక్షిస్తుంది. తీవ్ర రక్తపోటు సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతిరోజు క్యాబేజీ రసాన్ని తాగడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.