బీట్ రూట్ తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. దీనిలోని నైట్రేట్, విటమిన్లు రక్తహీనతను తగ్గిస్తాయని, మెదడు పని తీరు మెరుగుపరుస్తుందని అలాగే కంటి సమస్యలు దరి చేరవని చెబుతున్నారు. దీనిలోని సయానిన్ పెద్దపేగుల్లో క్యాన్సర్ తో పోరాడుతుందని పేర్కొంటున్నారు. అలాగే, జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుందని, బలం కోసం బీట్ రూట్ తినాల్సిందేనని అంటున్నారు.