వేసవిలో ప్రతి ఒక్కరి చర్మంపై ప్రభావం ఉంటుంది. ఈ క్రమంలో అబ్బాయిలు చర్మాన్ని సంరక్షించుకోవాలంటే రోజూ నీటిని ఎక్కువగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే, కీరదోస, పుచ్చకాయ వంటి పండ్లు ఎక్కువగా తినాలి. బయటకు వెళ్లేటప్పుడు సన్ స్క్రీన్ కచ్చితంగా రాసుకోవాలి. రోజుకు 2సార్లయినా చల్లని నీటితో ముఖం కడుక్కోవాలి. రసాయనాలు కలిగిన ఉత్పత్తులకు దూరంగా ఉండాలని పేర్కొంటున్నారు.