జాతిపిత మహాత్మా గాంధీ చెప్పిన చెడును వినకు, కనకు, మాట్లాడకు అనే నినాదంతో, సోషల్ మీడియాను మంచి కోసమే ఉపయోగిద్దామంటూ ఏపీలో ప్రభుత్వం వినూత్న ప్రచారం నిర్వహిస్తోంది.
ఈ మేరకు ప్రధాన పట్టణాలు, మున్సిపాలిటీల్లో ఈ పోస్టర్లను హోర్డింగులను అధికారులు ఏర్పాటు చేశారు. మేక్ సోషల్ మీడియా ఫర్ ఎ పాజిటివ్ ఎక్స్ పీరియన్స్ పేరుతో ప్రధాన కూడళ్లలో హోర్డింగ్స్‌ను నెలకొల్పారు.