ఏపీలోని నీటి ప్రాజెక్టులన్నీ తానే తెచ్చినట్లు సీఎం చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. నదుల్లో ప్రవహించే ప్రతి నీటిబొట్టు భూమిమీదకు రావాలని దివంగత నేత వైఎస్ఆర్ ఆకాంక్షించారని.
చంద్రబాబు ఏనాడూ ప్రాజెక్టుల గురించి పట్టించుకోలేదని ఆరోపించారు. కొత్తగా గోదావరి-బనకచర్ల ప్రాజెక్టును కూడా తనదేనని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇరిగేషన్ ప్రాజెక్టులను కూడా ప్రైవేటుపరం చేస్తున్నారని ఆరోపించారు.