పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్వాతంత్య్ర సమరయోధుడు భగత్‌సింగ్‌ను 93 ఏళ్ల క్రితం విచారించిన చారిత్రక పూంచ్‌హౌస్‌లోని ‘భగత్‌సింగ్ గ్యాలరీ’ని పర్యాటకులకోసం అందుబాటులోకి తీసుకొచ్చింది.
భగత్‌సింగ్ జీవితం, స్వాతంత్య్ర పోరాటానికి సంబంధించిన చిత్రాలు, లేఖలు, వార్తాపత్రికలు, విచారణ వివరాలు, ఇతర పత్రాలు గ్యాలరీలో ప్రదర్శనకు ఉంచారు. పంజాబ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జహీద్ అక్తర్ జమన్ ఈ గ్యాలరీని ప్రారంభించారు.