తన బస్సులు దగ్ధంపై టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బస్సుల దగ్ధం కేసులో పోలీసుల విచారణపై తనకు నమ్మకం లేదని వ్యాఖ్యానించారు.
బస్సులు షాట్ సర్య్కూట్‌తో తగలబడలేదని.. పక్కా పథకం ప్రకారమే కావాలనే తగులబెట్టారని విరుచుకుపడ్డారు. వాళ్లెవరో కనిపెట్టే దమ్ము, ధైర్యం పోలీసులకు అసలు ఉందా అని ప్రశ్నించారు.