రెవెన్యూ సమస్యల పరిష్కారంలో ప్రజల సంతృప్తి చాలా ముఖ్యమని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. సదస్సుల్లో అర్జీల పరిష్కారంపై వారు సంతృప్తిగా లేరని చెప్పారు. మంగళగిరిలోని APIICభవనంలో ప్రాంతీయ రెవెన్యూ అధికారుల సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ‘‘అర్జీల పరిష్కారంలో మొక్కుబడిగా పనిచేయడం మానుకోవాలి. పరిష్కరించగలిగిన అర్జీలను కూడా సకాలంలో పూర్తిచేయడం లేదు. ఈవిషయంపై CMఆగ్రహం వ్యక్తంచేశారు’’ అని పేర్కొన్నారు.