అధునాతన సాంకేతికతపై అవగాహన కోసం AP మేకర్ ల్యాబ్ ఆన్ వీల్స్‌కి సర్కార్ శ్రీకారం చుట్టింది. స్కూళ్ల వద్దకే వెళ్లి అవగాహన కల్పించేలా వాహనాలకు రూపకల్పన చేసింది.
నమూనా వాహనాన్ని మంత్రి లోకేష్ పరిశీలించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IOT) వంటి అధునాతన సాంకేతిక రంగాల్లో అంతర్జాతీయంగా వస్తున్న మార్పులపై విద్యార్థుల్లో అవగాహన కల్పించనుంది.