సెప్టెంబరులో సంభవించిన వరదల వల్ల విజయవాడ నగర ప్రజలు 4 రోజుల పాటు నీటి ముంపులోనే ఉన్నారని వెల్లడించారు. కనీసం రోజువారీ అవసరాలకు కూడా నీరు అందని పరిస్థితి ఎదుర్కొన్నారని వివరించారు. రోజుకు 20 లక్షల నుంచి 30 లక్షల వాటర్ బాటిళ్లు పంపిణీ చేశామని చెప్పారు. వాటర్ బాటిళ్ల పంపిణీని కూడా వైసీపీ రాజకీయం చేసిందని మండిపడ్డారు. ఈ నెలాఖరు కల్లా పూర్తి నివేదికను సీఎం చంద్రబాబుకు సమర్పిస్తామని వెల్లడించారు. బుడమేరు కాల్వపై 3,750 ఆక్రమణలు ఉన్నాయని, కాలువ సామర్థ్యం పెంచితే ప్రవాహం బయటికి వెళ్లేందుకు అవకాశం ఉంటుందని వివరించారు.