మహిళలకు ఉచిత బస్సు పథకంపై ఏపీలోని మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు కర్ణాటకలో పర్యటిస్తున్నారు. ఈ మేరకు బెంగళూరులో కర్ణాటక మంత్రిని ఏపీ మంత్రులు రాంప్రసాద్‌రెడ్డి , అనిత , సంధ్యారాణి కలిశారు.
కర్ణాటక మంత్రి రామలింగారెడ్డి, అధికారులతో వారు సమావేశమయ్యారు. ఆ రాష్ట్రంలో అమలవుతున్న ఉచిత బస్సు ప్రయాణంపై అధ్యయనం చేశారు. కర్ణాటక బస్సుల్లో ప్రయాణిస్తూ మంత్రుల కమిటీ వివరాలు అడిగి తెలుసుకుంది.