ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ముందు భారత సెలక్టర్లకు మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ సవాల్ విసురుతున్నాడు. విజయ్ హజారే ట్రోఫీ 2024-25లో శ్రేయస్ అయ్యర్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు.
ఈ టోర్నీలో ముంబై జట్టుకు సారథ్యం వహిస్తున్న అయ్యర్.. పుదుచ్చేరితో జరుగుతున్న రౌండ్ 6 మ్యాచ్‌లో అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. కేవలం 133 బంతుల్లో అయ్యర్.. 16 ఫోర్లు, 4 సిక్స్‌లతో 137 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.