తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపడతామని ఎమ్మెల్యే బడేటి చంటి హామీ ఇచ్చారు. శుక్రవారం ఏలూరు 4వ డివిజన్ మారుతీనగర్‌లో నూతనంగా నిర్మిస్తున్న రోడ్లు, డ్రెయినేజీ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికులు తాగునీటి సమస్య ఉందని చెప్పడంతో సమస్య పరిష్కారానికి ప్రణాళికలు రూపొందించామని నిధులు మం జూరైన వెంటనే చర్యలు చేపడతామన్నారు. కార్యక్రమంలో కమిషనర్ భానుప్రతాప్, చోడే వెంకటరత్నం, ఎస్‌ఎంఆర్ పెదబాబు, ఆర్నేపల్లి తిరుపతి, పూజారి నిరంజన్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అర్హత కలిగిన వారికి నూతనంగా పింఛన్లు, ఇళ్లు మంజూరు చేస్తామన్నారు.