నరసాపురం–మచిలీపట్నం మధ్య చేపట్టే కొత్త రైల్వేలైన్ పనులకు డీపీఆర్ సిద్ధమైందని, రానున్న బడ్జెట్ లో ఈ ప్రాజెక్టుకు నిధులు విడుదలయ్యే ఛాన్స్ ఉందని కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాసవర్మ అన్నారు. నరసాపురం– కోటి పల్లి రైల్వేలైన్ జాప్యానికి నిధులు, భూసేకరణనే కారణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్ళల్లో ఇవ్వాల్సిన వాటా మొత్తంలో ఒక్క రూపాయి కూడా చెల్లించలేదన్నారు. ఈ బడ్జెట్‌లో విడు దలయ్యే నిధులతో ఈ పనులు వేగవం తం అవుతాయన్నారు. నరసాపురం వారణాశిల మధ్య కొత్త రైలు, నరసా పురం–సికింద్రాబాద్‌ల మధ్య వందేభారత్ రైలు ప్రతిపాదనలో ఉంద న్నారు. త్వరలో భీమవరం–చెన్నైల మధ్య వందేభారత్‌ను కూడా తీసుకొస్తామన్నారు. కూటమి రాకతో రాష్ట్రంలో పరిస్థితి మారిందని, పరిశ్రమల ఏర్పాటుకు ఆనువైన వాతావరణం నెలకొందన్నారు.