కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు. శుక్రవారం కల్లూరు మండల పరిషత కార్యాలయంలో ఎంపీపీ బి.శారద అధ్యక్షతన చేపట్టిన సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా సావిత్రీబాయి పూలే, మాజీ ప్రధానమంత్రి మన్మోహనసింగ్ చిత్రపటాలకు ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళి అర్పించారు. మండలస్థాయి అధికారులు మూడు నెలల్లో సాధించిన ప్రగతి నివేదికలను చదివి వినిపించారు. మండలంలో రూ.1.06 కోట్లతో గ్రామాల్లో పారిశుధ్యం, తాగునీరు తదితర అభివృద్ధి పనులు చేశామని ఈఓఆర్డీ సభ దృష్టికి తెచ్చారు. ఎంపీటీసీలు, సర్పం చులు ఇళ్లస్థలాలు, బిల్లుల మంజూరుకు డబ్బులు అడుగుతున్నారని, గ్రామ సమస్యలపై రెవెన్యూ అధికారులను కలిసిన ప్రజాప్రతినిధులకు పనులు చేయకపోగా ఈసడించుకుంటున్నారని ఆరోపించారు. సమావే శానికి ఆర్‌అండ్‌బీ, విద్యుత, సాంఘిక సంక్షేమశాఖ అధికారులు గైర్హాజ రయ్యారు. ఈసంద ర్భంగా ఎమ్మెల్యే గౌరు చరిత మాట్లాడుతూ గ్రామాల్లో అభివృద్ధి పనులకు ఆటంకం కల్పిస్తే ఊరుకోమన్నారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో రహదారులను వేశామని, పనులు పూరైన వెంటనే బిల్లులు సకాలంలో మంజూరు అవుతున్నాయని గౌరుచరిత తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో జగనన్న కాటనీల్లో అర్హతలేని వారికి పదుల సంఖ్యలో ఇళ్లు కట్టబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్ర మంలో ఎంపీడీఓ జి.నాగశే షాచలరెడ్డి, తహసీల్దారు కె.ఆంజనేయులు అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.