AP: సీఎం చంద్రబాబు సోమవారం కుప్పంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘తెలంగాణకు హైదరాబాద్ నుంచే ఎక్కువ ఆదాయం వస్తుంది. ఆనాడు నేను చేసిన అభివృద్ధి ఫలాలు ఇప్పుడు వస్తున్నాయి. 2014-19 మధ్య రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడిపించాం. వైసీపీ హయాంలో 4 శాతం అభివృద్ధి తగ్గిపోయింది. రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది. కుప్పంకు పెట్టుబడులు తీసుకొస్తాం. ఉపాధి కల్పిస్తాం.’ అని అన్నారు.