వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు. కాకినాడ సీ పోర్టు లిమిటెడ్ , కాకినాడ సెజ్‌లోని వాటాలను బలవంతంగా లాగేసుకున్నారని విజయసాయిపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం హైదరాబాద్‌లో ఈడీ ఆఫీసులో విచారణకు ఎంపీ హాజరయ్యారు. కాకినాడ సెజ్‌లో తన వాటాలను బలవంతంగా లాక్కున్నారన్న కర్నాటి వెంకటేశ్వరరావు ఫిర్యాదుతో సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ హాయంలో కాకినాడ పోర్టు లిమిటెడ్, కాకినాడ సెజ్‌లోని రూ.3600 కోట్ల విలువైన షేర్లను కేవీరావు నుంచి బలవంతంగా తీసుకున్నారని వచ్చిన ఆరోపణల కేసులో ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. సీఐడీ కేసు ఆధారంగానే ఈడీ దర్యాప్తు చేసింది. మనీలాండరింగ్ కోణంపై కూడా ఈడీ దర్యాప్తు చేయనుంది. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఒకసారి విజయసాయికి ఈడీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున అప్పట్లో ఈడీ విచారణకు విజయసాయి హాజరుకాలేదు.