రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ సోమవారం పశ్చిమగోదావరి జిల్లాలో పర్య టిస్తారు. ఉండి, కాళ్ళ, భీమవరం తదితర ప్రాంతాల్లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని ప్రారంభిస్తారు. ఈరోజు ఉదయం 10 గంటలకు ఉండి ఉన్నత పాఠశాల అభివృద్ధి పనులను మంత్రి లోకేష్ ప్రారంభిస్తారు. అనంతరం కాళ్ల మండలం పెద ఆమిరం జువ్వలపాలెం రోడ్ లో శ్రీ రతన్ టాటా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. పెద ఆమిరం.. ఉండి లింక్ రోడ్డు వైన్డింగ్ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం భీమవరం ఎస్‌ఆర్‌కెఆర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు. తర్వాత ఎస్‌ఆర్‌కెఆర్ ఇంజనీరింగ్ కళాశాల సంక్రాంతి సంబరాల్లో మంత్రి లోకేష్ పాల్గొంటారు.