తాడిపత్రి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఈనెల 6 నుంచి 15వ తేదీ వరకు ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి ఆధ్వర్యంలో జేసీ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నారు.ప్రతిరోజు ఉదయం 7:30గంటలకు మ్యాచ ప్రారంభం కానుంది. టోర్నమెంట్ విజేతకు రూ.75వేలు, రన్నర్‌పకు రూ.50వేలు, మూడవ బహుమతిగా రూ.25వేలు నిర్వాహకులు అందించనున్నారు. మ్యాచ ప్రారంభ సమయానికి అరగంటే ముందే జట్ల సభ్యులు హాజరుకావాలని , నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని నిర్వాహకులు విజ్జి, సుధీర్ ఆదివారం ప్రకటనలో తెలిపారు.