కాకినాడలో నిలిచిపోయిన స్టెల్లా నౌకకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఈరోజు (సోమవారం) తెల్లవారుజామున పశ్చిమ ఆఫ్రికాకు నౌక బయలుదేరి వెళ్లిపోయింది. దాదాపు 55 రోజులుగా కాకినాడ పోర్టులో 'స్టెల్లా ఎల్' నౌక నిలిచిపోయిన విషయం తెలిసిందే. నౌక పశ్చిమ ఆఫ్రికా తీరంలోని బెనిన్ దేశంలో కొటోనౌ పోర్టుకు బయల్దేరేందుకు కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్ అనుమతిచ్చారు. గతేడాది నవంబరు 11న స్టెల్లా నౌక బియ్యం లోడింగ్ కోసం కాకినాడ తీరానికి వచ్చింది. అయితే నౌకలోకి 32,415 టన్నులు లోడవగా అందులో రేషన్ బియ్యం ఉన్నట్లు నవంబరు 27న గుర్తించారు. రేషన్ బియ్యం దించేసి మిగిలిన సాధరణ బియ్యం లోడింగ్ చేసుకుని స్టెల్లా నౌక వెళ్లిపోయింది. గత ఏడాది నవంబర్‌లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టును సందర్శించగా.. స్టెల్లా నౌకలో రేషన్ బియ్యం ఉండటాన్ని గుర్తించారు. ఈ వార్త అప్పట్లో పను సెంచలనంగా మారింది. వెంటనే స్టెల్లా నౌకను సీజ్ చేయాల్సిందిగా అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు.