సోమవారం మంత్రి నారా లోకేశ్ పర్యటనలో ఎక్కడ ఎటువంటి పొరపాట్లు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని పశ్చిమగోదావరి జిల్లా జాయింట్ కలెక్టరు టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. ఉండిలో మంత్రి లోకేశ్ పర్య టించే ప్రాంతాలను జేసీ ఆదివారం పరిశీలించారు. మంత్రి లోకేశ్ చేతుల మీదుగా ప్రారంభించనున్న సీసీ రహదారి, పూర్వపు పాఠశాల భవనం, క్రీడాసౌకర్యాలు నిమిత్తం ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలను పరిశీలించి అధికారులకు సూచనలు అందించారు. గ్రామంలో రహదారుల పక్కన చెత్తచెదారం లేకుండా శానిటేషన్ చేసి బ్లీచింగ్ చల్లే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని ఎస్పీ నయీం ఆద్నాన్ అస్మి తెలిపారు. ప్రారంభోత్సవ శిలాఫలకాలను సుందరంగా తీర్చిదిద్దారు.