ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు సంపద సృష్టికర్తలని రైల్వేశాఖ సహాయ మంత్రి సోమణ్ణ పేర్కొన్నారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలో రూ.33.50 కోట్లతో నిర్మించిన రైల్వే ఫ్లైఓవర్‌ను ఆయన ఆదివారం ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ అంటే అభివృద్ధికి మారుపేరన్నారు. చంద్రబాబు అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆయన ప్రజాసంక్షేమం కోసం పాటుపడుతున్నారన్నారు. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో తెలుగు రాష్ట్రాల్లో రైల్వేల అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానన్నారు. ప్రస్తుతం ఫ్లైఓవర్ నిర్మాణంతో ఈ ప్రాంత ప్రజల చిరకాలవాంఛ నెరవేరిందన్నారు.