అనంతపురం జిల్లా, పుట్లూరు మండలంలోని సంజీవపురం గ్రామంలో వారం రోజుల నుంచి ఓ కొండముచ్చు కోతి గ్రామస్థులను భయబ్రాంతులకు గురిచేస్తోంది. దీంతో వారు అటవీశాఖాధికారులకు ఫిర్యాదుచేశారు.వారు ఆదివారం గ్రామానికి చేరుకుని చాకచక్యంగా ఆ కోతిని బంధించారు. కోతివల్ల చాలా ఇబ్బందులు పడ్డామని గ్రామస్థులు అధికారులకు తెలిపారు. దీనిని అటవీ ప్రాంతంలో వదిలేస్తామని అధికారులు తెలిపారు.