కూటమి ప్రభుత్వం సమాజ శ్రేయస్సు కోసం పనిచేయకుండా సినీ నిర్మాతలు, బడా హీరోల కోసమే పనిచేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. పక్కా రాష్ట్రం తెలంగాణలో బెనిఫిట్ షోలకు టికెట్ల ధరలను పెంచబోమని చెబితే, ఇక్కడ ఆంధ్రప్రదేశ ఉపముఖ్యమంత్రి పవన కళ్యాణ్ మాత్రం పెంచుతామని చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడం కాని, వారి సంక్షేమం గురించి గాని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించడం లేదని మండిపడ్డారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జగదీష్, పార్టీ జిల్లా కార్యదర్శి జాఫర్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎండీ సంజీవప్ప, నియోజకవర్గ కార్యదర్శి గోపాల్, సీపీఐ పట్టణ కార్యదర్శి ఓంకార్ యాదవ్, సీపీఐ నాయకులు, ఏఐఎ్‌సఎఫ్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.