ఆలయాల ఆస్తులు, ఆచారాలు నాశనమైపోతున్నాయని త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలోని గన్నవరం, కేసరపల్లి లైలా గ్రీన్ మెడోస్ ప్రాంగణంలో ఆదివారం హైందవ శంఖారావం సభ జరిగింది. ఈ సభలో వీహెచ్‌పీ జాతీయ ప్రతినిధులు, బీజేపీ నేతలు, మఠాధిపతులు, పీఠాధిపతులు, స్వామీజీలు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి మాట్లాడారు. ఆలయాలు బాగుంటేనే మనం బాగుంటామని చెప్పారు. మన ఆలయాలకు గతంలో 15 లక్షల ఎకరాలు ఉండేదని చెప్పారు. ఐసుగడ్డ మాదిరిగా కరుగుతూ 4.50 లక్షల ఎకరాలు మాత్రమే మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయాలకు కావాల్సిన నిర్ణయాలు ఎవరు చేయాలని ప్రశ్నించారు.