మంగళవారం ఉదయం 10. గంటలకు సీఎం చంద్రబాబు కుప్పం ఆర్ అండ్ బీ అతిథి గృహం నుండి బయలుదేరి కుప్పం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ చేరుకుని జననాయకుడు సెంటర్ ప్రారంభించి. ప్రజల నుండి వినతులు స్వీకరణ కార్యక్రమం చేపడతారు. మధ్యాహ్నం12.20 గంటలకు కంగుంది గ్రామం చేరుకుని కీర్తిశేషులు శ్యామన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. 1.20 గంటలకు కుప్పంలోని ఎన్‌టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు వెళతారు. తర్వాత మధ్యాహ్నం 2.00 గంటల నుండి సాయంత్రం 4.30 గంటల వరకు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. సాయంత్రం 5.05 గంటలకు శాంతిపురం మండలం కడపల్లి వద్ద నిర్మిస్తున్న సొంత ఇల్లు నిర్మాణాన్ని పరిశీలిస్తారు. 6.10 గంటలకు ద్రవిడ యూనివర్సిటీ చేరుకుని అకాడమిక్ బిల్డింగ్‌లోని 1M1B (కెరీర్ రెడీనెస్ సెంటర్) ను ప్రారంభిస్తారు. అనంతరం ద్రవిడ యూనివర్సిటీలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి రాత్రి 7.45 గంటలకు ఆర్‌అండ్‌బి అతిథి గృహం చేరుకొని రాత్రికి అక్కడే= బస చేస్తారు. 8వ తేదీ (బుధవారం) ఉదయం 8 గంటలకు కుప్పం నుంచి బయలుదేరి విజయవాడకు వెళతారు.