నేపాల్‌లో ఓ విమానానికి పెను ప్రమాదం తప్పింది. బుద్ధ ఎయిర్‌లైన్స్ విమానం సోమవారం సిబ్బంది సహా మొత్తం 76 మంది ప్రయాణికులతో ఖాట్మాండులోని త్రిభువన్ విమానాశ్రయం నుంచి భద్రాపూర్‌కు బయల్దేరింది.
అయితే, విమానం గాల్లోకి ఎగిరిన కాసేపటికే ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన పైలట్ ఈ విషయాన్ని అధికారులకు తెలియజేశారు. అనంతరం విమానాన్ని త్రిభువన్ ఎయిర్‌పోర్ట్‌కు మళ్లించి అక్కడ సేఫ్‌గా ల్యాండ్ చేశారు.