అమెరికా బయటి దేశాల రాజకీయాల్లో ఎలాన్ మస్క్ జోక్యం చేసుకోవడం ఆందోళన కలిగిస్తోందని నార్వే ప్రధాని జోనాస్ గహర్ స్టోయ్ పేర్కొన్నారు. తన సామాజిక మాధ్యమాన్ని విస్తృతంగా వినియోగించుకునే సౌలభ్యం మస్క్‌కు ఉంది.
ఆయన దగ్గర బోలెడన్ని ఆర్థిక వనరులున్నాయి. అలాంటి వ్యక్తి ఇతర దేశాల అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడం ప్రజాస్వామ్యాలు, వాటి మిత్ర పక్షాలకు మంచిది కాదని జోనాస్ వ్యాఖ్యానించారు.