చిన్నారులు, మహిళలతో సహా అఫ్గాన్ పౌరులపై వైమానిక దాడులు జరగడం పట్ల భారత విదేశాంగశాఖ ఆందోళన వ్యక్తం చేసింది. అమాయక పౌరులపై దాడి జరిగితే భారత్ నిస్సందేహంగా ఖండిస్తుందని స్పష్టం చేసింది.
తమ అంతర్గత వైఫల్యాలకు పొరుగు దేశాలను నిందించడం పాక్‌కు అలవాటుగా మారిందని, ఈ అంశంపై అఫ్గాన్ అధికార ప్రతినిధి మాట్లాడిన విషయం కూడా తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది.