ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈనెల 8న విశాఖపట్నంలో భూమి పూజ చేస్తున్న, ప్రారంభిస్తున్న ప్రాజెక్టులన్నీ గత ప్రభుత్వంలో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి చొరవతో సాధించనవని విశాఖ జిల్లా వెయస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ వెల్లడించారు. అయినా అవన్నీ తమ ఘనతగా ఈ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని ఆయన ఆక్షేపించారు. టీడీపీ ప్రభుత్వం ఏనాడూ ఉత్తరాంధ్రపై దృష్టి పెట్టలేదని విశాఖలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి స్పష్టం చేశారు. గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందిందన్న ఆయన, ఈ విషయంపై బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు.