ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దరఖాస్తులు పెండింగ్‌లో పెట్టారని అధికారులపై మంత్రి ఆగ్రహం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 06, 2025, 03:13 PM

రెరా అధికారులపై మంత్రి నారాయణ  ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తులు పెండింగ్‌లో పెట్టడంపై మంత్రి ఫైర్ అయ్యారు. ఏపీ రెరాలో పెండింగ్ దరఖాస్తులపై మంత్రి ఈరోజు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. రేరా అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రెరాలో అనుమతుల కోసం నెలల తరబడి దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ విషయాన్ని మంత్రి దృష్టికి పలువురు బిల్డర్లు, డెవలపర్లు తీసుకొచ్చారు. ఎనిమిది నెలలుగా ఎందుకు దరఖాస్తులు పెండింగ్‌లో పెట్టారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలనే దరఖాస్తురాదులను వేధింపులకు గురి చేస్తునట్లు మంత్రికి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరిస్తున్నారని కొంతమంది అధికారుల తీరుపై మండిపడ్డారు. అంశాల వారీగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపై మంత్రి నారాయణ ఆరా తీశారు. రెరా అధికారులతో నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంత్రి ఏపీ రెరాకు సంబంధించి అనేక‌ వినతులు వచ్చాయని.. 167 దరఖాస్తులు షార్ట్ ఫాల్స్ పంపారని తెలిపారు. పరిష్కారం కావడం‌లేదని కొన్ని ఫిర్యాదులు వచ్చాయన్నారు.మా సమాచారం అందుకుని ‌ 30 మంది క్లయింట్లు, ప్రతినిధులు వచ్చారు. అనేక అంశాల పై ఈరోజు వారితో చర్చించాం. ఇబ్బందులు పరిష్కారం కోసం కొన్ని సూచనలు చేశాం. ఇతర రాష్ట్రాల్లో అమలు చేసిన విధానాలను కూడా కొన్ని పరిశీలీంచాం. కమిటీ వేసి మరింత సరళతరంగా ఉండేలా చూస్తాం. అపార్ట్‌మెంట్, ‌విల్లాలు‌కొనే వారు నష్టపోకుండా చూస్తాం. ప్రకటనలు చూసి కొనేవారు మోసపోకూడదనే రెరా తీసుకు వచ్చాం. అక్కడ ఉన్న సదుపాయాలు అగ్రిమెంట్ ప్రకారం ఉన్నాయా లేదా అనేది రెరా అధారిటీ పరిశీలిస్తుంది. నాలుగైదు అంశాలు మినహా అన్ని సమస్యలు పరిష్కరించాం అని మంత్రి వెల్లడించారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com