సీఎం నారా చంద్రబాబు నాయుడును అమరావతి పార్టీ కార్యాలయంలో పాడేరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గిడ్డి ఈశ్వరి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె పాడేరులోని అంబేడ్కర్ కూడలి వద్ద త్రీ కారిడార్ రోడ్డు నిర్మాణంపై ప్రస్థావించారు. ఈ క్రమంలో సీఎం సానుకూలంగా స్పందించి త్వరలో నిర్మాణ పనులు మొదలు పెడతామని హామీ ఇచ్చినట్లు గిడ్డి ఈశ్వరి తెలిపారు.