విద్యార్థులకు వైయస్ఆర్‌సీపీ అండగా నిలుస్తూ ఫిబ్రవరి 5న తలపెట్టిన 'ఫీజుపోరు' కార్యక్రమం పోస్టర్‌ను వైయస్ఆర్‌సీపీ నేతలు విడుదల చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రులు జోగి రమేష్, అంబటి రాంబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, విద్యార్థి విభాగం నేతలు పానుగంటి చైతన్య, రవిచంద్ర సహా పలువురు నేతలు పోస్టర్‌ని రిలీజ్ చేశారు.ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. రూ.3,900 కోట్ల బకాయిలు చెల్లించకుండా చంద్రబాబు వేధిస్తున్నారని మండిపడ్డారు. విద్యా సంస్థలు.. విద్యార్థులకు సర్టిఫికేట్లు కూడా ఇవ్వటం లేదు. దీనివలన విద్యార్థులు కూలీగా మారిపోతున్నారన్నారు. 2014-19లో కూడా చంద్రబాబు ఇలాగే బకాయిలు పెడితే వైయస్ జగన్ వచ్చాక రిలీజ్ ఇచ్చారు. చంద్రబాబు వ్యవహార శైలి ఎప్పుడూ ఇలాగే ఉంటుందని అంబటి రాంబాబు గుర్తు చేశారు. విద్యార్థులకు అండగా వైయస్ఆర్‌సీపీ ఉంటుంది. గడిచిన 8 నెలల్లోనే తీవ్ర వ్యతిరేకత వచ్చింది. చంద్రబాబు 420 అంటూ జనం విమర్శలు చేస్తున్నారు. వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు ఇవ్వకపోతే పోరాటం తీవ్ర రూపం చేస్తాం’’ అని అంబటి రాంబాబు హెచ్చరించారు.