వైయస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై రాజకీయ కక్షతోనే.. ఆయన అటవీ భూములు ఆక్రమించారంటూ ఎల్లో మీడియా తప్పుడు కథనం అచ్చేసిందని, ప్రభుత్వం దానిపై ఏ విచారణ చేసుకున్నా ఆయన కడిగిన ముత్యంలా బయటపడతారని వైయస్ఆర్సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆ పత్రిక తప్పుడు కథనంపై ఆధారాలతో సహా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వివరణ ఇచ్చినా.. దానికి కేవలం సింగిల్ కాలమ్ కేటాయించి, పత్రికా విలువలను తుంగలో తొక్కిందని ఆక్షేపించారు. కూటమి ప్రభుత్వం ఎన్ని వేధింపులకు గురి చేసినా, తమ పోరాటం నుంచి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని భూమన కరుణాకర్‌రెడ్డి తేల్చి చెప్పారు.